Rakshita Suresh | మలేషియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపులర్ ప్లే బ్యాక్ సింగర్ రక్షిత సురేశ్ (Rakshita Suresh)కు గాయాలయ్యాయి. ఎయిర్పోర్ట్కు వెళ్తున్న క్రమంలో రక్షిత సురేశ్ వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన గురించి రక్షిత సురేశ్ సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
ఆ రెండు సెకన్ల ప్రభావంతో నా జీవితమంతా ఒక్కసారి కండ్ల ముందు మెరిసింది. ఎయిర్బ్యాగ్స్కు ధన్యవాదాలు. అవి లేకపోతే నా పరిస్థితి దారుణంగా ఉండేది.. అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఏం జరిగిందో తలచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతోంది. డ్రైవర్, ముందు సీట్లో ఉన్న ప్రయాణికుడు, నేను స్వల్ప గాయాలతో బయటపడటం సంతోషంగా ఉంది. నేను బతకడం అదృష్టంగా భావిస్తున్నానని పోస్టులో రాసుకొచ్చింది రక్షిత సురేశ్.
రోడ్డు ప్రమాదం జరిగిందని అని తెలియగానే ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు, రక్షిత సురేశ్ ప్రమాదంపై క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చల్ల గాలి (Challa Gaali Song) పాట పాడింది రక్షిత సురేశ్. ఇటీవలే వచ్చిన భారీ మల్టీ స్టారర్ పొన్నియన్ సెల్వన్ 2లో కిరునగే (కన్నడ ట్రాక్) పాట పాడింది.
Sakshi Vaidya | గాండీవధారి అర్జున అప్డేట్.. సాక్షి వైద్య డబ్బింగ్ షురూ
Leo | లియో షూట్లో జాయిన్ అయిన మలయాళ భామ