Sakshi Vaidya | ఇటీవలే ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది మోడల్ సాక్షి వైద్య (Sakshi Vaidya). హీరోయిన్గా గ్లామరస్‌గా కనిపించినా తొలి ఎంట్రీతోనే ఫెయిల్యూర్ చవిచూసింది. అయితే ఈ భామ మరో యువ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej)తో గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. V12గా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ అందించింది సాక్షి వైద్య. ఈ భామ సినిమాలోని తన పాత్ర కోసం డబ్బింగ్ షురూ చేసింది.
డబ్బింగ్ స్టూడియోలోని స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఈ విషయాన్ని అందరితో పంచుకుంది. ఏజెంట్ ప్లాఫుతో సంబంధం లేకుండా సాక్షి వైద్యను హీరోయిన్గా తీసుకునేందుకు చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్ గాండీవధారి అర్జున మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మేకర్స్ త్వరలో బుడాపెస్ట్‌లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తుండగా.. ఈ యాక్షన్ పార్టు కోసం వరుణ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌తో కలిసి కసరత్తులు చేస్తున్న స్టిల్స్, వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గాండీవధారి అర్జున చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Sakshi Vaidya1
ప్రాక్టీస్ సెషన్లో వరుణ్‌తేజ్ ఇలా..
Sweating it out to set the screens ablaze 🔥
Mega Prince @IAmVarunTej is prepping for a high-octane action sequence of #GandeevadhariArjuna, that is to be shot in Budapest soon💥💥@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @jungleemusicSTH pic.twitter.com/SE4J9uUw0R
— SVCC (@SVCCofficial) May 3, 2023