SS4 | సుడిగాలి సుధీర్(Sudigaali Sudheer), దివ్య భారతి (Divyabharathi) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ఎస్ఎస్4 (SS4). పాగల్ ఫేం దర్శకుడు నరేష్ కుప్పిలి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్గా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి పాపులర్ మ్యూజిక్ కంపోజర్ లియోన్ జేమ్స్ సంగీతం అందించబోతున్నాడు.
ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సుధీర్ టీం. ఎక్జయిటింగ్ ఓపెనింగ్ సెర్మనీ తర్వాత బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ లియోన్స్ జేమ్స్ కు స్వాగతం పలుకుతుండటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు మేకర్స్. విశ్వక్ సేన్ నటించిన పాగల్, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ సినిమాలకు అదిరిపోయే ఆల్బమ్స్ అందించాడని తెలిసిందే. మరి సుధీర్ సినిమాకు ఎలాంటి ఆల్బమ్ అందిస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.
SS4 టీంకు పనిచేస్తున్న వారి వివరాలు..
డైరెక్టర్ : నరేష్ కుప్పిలి
డి.ఓ. పి – బాలాజీ సుబ్రహ్మణ్యం
ఎడిటర్ – కె విజయవర్ధన్
ఆర్ట్ – రాజీవ్ నాయర్
రచయిత – ఫణికృష్ణ సిరికి
కో-డైరెక్టర్ – శ్రీకాంత్ కోల
అసోసియేట్ డైరెక్టర్ – బబ్లు
ప్రొడక్షన్ కంట్రోలర్ – రాంబాబు
బుద్దాల
ప్రొడక్షన్ మేనేజర్స్ – ప్రభాకర్ రాజు, గోవిందు దనాల
కాస్ట్యూమ్ డిజైనర్- శ్రీహిత
పి.ఆర్.ఓ – ఏలూరు శ్రీను, మడూరి మధు
After the exciting opening ceremony, Team #SS4 welcomes aboard Blockbuster Music Director @leon_james on board 🎹
🌟@sudheeranand @divyabarti2801
💰@MahatejaC @luckymediaoff pic.twitter.com/11PllQYD3a
— Vamsi Kaka (@vamsikaka) May 16, 2023