బార్సిలోనా: పాప్ స్టార్ షకీరాకు 8 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పన్ను ఎగవేత కేసులో ఆమెకు ఆ శిక్ష వేయాలని బార్సిలోనా ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్యాక్స్ కుంభకోణం కేసులో అంగీకార ఒప్పందాన్ని నిరాకరించిన నేపథ్యంలో ఆమెకు ఆ శిక్షను వేయాలని స్పెయిన్ కోర్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు త్వరలో తేదీని ప్రకటించనున్నారు. 2012 నుంచి 2014 వరకు పన్ను ఎగవేసిన కేసులో 23 మిలియన్ల డాలర్ల జరిమానా కూడా కోర్టు విధించనున్నది. షకీరాకు జైలు శిక్ష విధించాలన్న వార్తలను ఎల్ పారిస్ పత్రిక కవర్ చేసింది.