Park Bo Ram : దక్షిణ కొరియా సింగర్ పార్క్ బొ రామ్ (30) మరణించింది. పాప్ సింగర్ మరణంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పార్క్ బొ రామ్ మరణానికి కారణాలేంటనేది ఇంకా వెలుగులోకి రాలేదు. ఏప్రిల్ 11 అర్ధరాత్రి పార్క్ బొ రామ్ హఠాన్మరణం అందరినీ విస్మయానికి గురిచేసిందని ఆమె అభిమానులందరికీ ఈ దుర్వార్త తెలిపేందుకు చింతిస్తున్నామని సింగర్ ఏజెన్సీ వెల్లడించింది.
మరణానికి కొద్ది గంటల ముందు ఆమె ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఆ కార్యక్రమంలో ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించింది. ఆపై రాత్రి 9.55 గంటలకు రెస్ట్ రూంకు వెళ్లి ఎంతకీ తిరిగిరాకపోవడంతో ఆమె స్నేహితులు వెళ్లి చూడగా సింక్‌పై అపస్మారక స్ధితిలో పడిఉంది.
పార్క్ బొ రామ్ 2010లో 17 ఏండ్ల వయసులో సూపర్ స్టార్ కే2 పాటల పోటీలో తన టాలెంట్‌తో ప్రాచుర్యంలోకి వచ్చింది. 2014లో తన సింగిల్ బ్యూటిఫుల్ రిలీజ్‌తో పాప్ మ్యూజిక్ పరిశ్రమలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ఆమె ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సహా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది.
Read More :
Cannabis | బంగ్లాపై గంజా సాగు.. బ్రిటన్ పౌరుడు అరెస్ట్