Cannabis | బంగ్లాపై గంజా సాగు.. బ్రిటన్ పౌరుడు అరెస్ట్
బంగ్లాపై గంజాయి (Cannabis) సాగుచేస్తూ ఓ విదేశీయుడు పట్టుబడ్డాడు. బ్రిటన్‌కు చెందిన జేసన్ (Jason) ఉత్తర గోవాలోని సొకారోలో నివాసం ఉంటున్నాడు. అతడు తన ఇంటిపై గంజాయి సాగుచేస్తున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)కి సమాచారం అందించారు.
తిరువనంతపురం: బంగ్లాపై గంజాయి (Cannabis) సాగుచేస్తూ ఓ విదేశీయుడు పట్టుబడ్డాడు. బ్రిటన్‌కు చెందిన జేసన్ (Jason) ఉత్తర గోవాలోని సొకారోలో నివాసం ఉంటున్నాడు. అతడు తన ఇంటిపై గంజాయి సాగుచేస్తున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)కి సమాచారం అందించారు. అతని ఇంటిపై దాడిచేసిన అధికారులు.. ఇతర మొక్కలతోపాటు పూల కుండీల్లో గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. 33 గంజాయి చెట్లు, 10 గ్రాముల గంజా, రూ.40 వేలు సీజ్ చేశారు. దీంతో కేసు నమోదుచేసి జేసన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, గతంలో కూడా ఎన్సీబీ అధికారులు అతడిని అరెస్టు చేశారు. 2022, నవంబర్ 28న అతనివద్ద 107 ఎక్స్టసీ ట్యాబ్లెట్లు, 40 గ్రాముల ఎండీఎంఏ పౌడర్, 55 గ్రాముల చరాస్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడు బెయిల్‌పై ఉన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

