పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’. త్రిగుణ్ కీలక పాత్రధారి. జి.ఆర్.ఆదిత్య దర్శకుడు. సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘పూర్ణ కెరీర్లోనే ఉత్తమమైన నటన కనబరిచిన సినిమా ఇది. అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని మలుపులతో దర్శకుడు జి.ఆర్.ఆదిత్య చిత్రాన్ని తెరకెక్కించారు. కేవలం నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ అల్లిన ఈ కథ ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుంది.’ అని నిర్మాత సురేష్‌రెడ్డి కొవ్వూరి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ముథుకుమార్, సంగీతం: మిస్కిన్, సహ నిర్మాతలు: శ్రీనివాస్ మేదరమెట్ల, జమ్ముల కొండలరావు, సమర్పణ: పట్లోళ్ల వెంకట్‌రెడ్డి, నిర్మాణం: P 19 ట్రాన్స్ మీడియా స్టూడియోస్.