పూనమ్ పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సన్నీ లియాన్ తర్వాత అంతగా కుర్రకారు హృదయాలను దోచుకుంది ఎవరంటే ఈ అమ్మడి పేరే చెబుతారు. 2020 సెప్టెంబర్ 10న సామ్ బాంబే (Sam bombay) ను పూనమ్(Poonam Pandey) ప్రేమ వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు.
పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్‌కి గోవా వెళ్లారు. ఆ సమయంలో తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడంటూ సామ్ బాంబే పై ఆమె కేసు పెట్టారు పూనమ్ . దీంతో గోవా పోలీసులు సామ్ బాంబేను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కాంప్రమైజ్ కావడంతో పాటు, కలిసి ఉంటున్నారు.
తాజాగా పూనమ్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సామ్ బాంబేని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సామ్‌బాంబే తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతున్న క్రమంలో పూనమ్ అతనితో గొడవపడిందట. దీంతో ఆయన పూనమ్ జుట్టు పట్టుకొని తలను గోడకేసి కొట్టాడట. దీంతో పూనమ్ తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన పూనమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పూనమ్ ఫిర్యాదు మేరకు ఆమె భర్తను బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై తాజాగా మీడియా ఛానల్‌తో మాట్లాడిన పూనమ్ .. ‘ఇది మొదటి సారి జరిగింది కాదు. ప్రతిసారి సామ్ నన్ను కొట్టడం..ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెప్పడంతో నేను కరిగిపోయేదాన్ని. ఈసారి మాత్రం నన్ను చావబాదాడు. ఈ దాడుల వలన నేను ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుందో తెలియదు అని పేర్కొంది.