Poonam Kaur | ఒకప్పుడు టాలీవుడ్లో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది పూనమ్ కౌర్. ఈమె సినిమాల కన్నా కూడా వివాదాలతోనే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా ట్వీట్లు చేయడం గురూజీ అంటూ త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ కొన్ని పోస్ట్‌లు పెట్టడం వంటి చేస్తుంది పూనమ్ కౌర్. అయితే తాజాగా ఆమె ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఓ బహుమతిని కూడా ఇచ్చింది పూనమ్ కౌర్. ఆమె అందించిన కానుక సాంప్రదాయ పటచిత్ర కళను ఆధారంగా చేసుకొని ఉంది . ఇందులో అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించే దృశ్యాలతో పాటు , ఆ ప్రాంతం కలల రాజధానిగా ఎలా మారుతోందో కళాత్మకంగా వివరించబడింది.
కళ, కథనం, భావోద్వేగాల సమ్మేళనంగా ఆర్ట్ వర్క్‌ని సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఆసక్తిగా గమనించారు. అయితే చాలా రోజుల తర్వాత ఈ కార్యక్రమంలో కనిపించిన పూనమ్ చాలా లావుగా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా కనిపించింది. ఈ క్రమంలో నెట్టింట అనేక వార్తలు హల్చల్ చేస్తున్ననేపథ్యంలో పూనమ్ కౌర్ తన హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం ఏమీ బాగా లేదని , ఫుడ్ ఎలర్జీ వచ్చిందని పూనమ్ చెప్పుకొచ్చింది.ఈవెంట్లో పాల్గొనేకంటే ముందు ఆమె ఆరోగ్యం ఏమీ బాగా లేదంట. ఫుడ్ ఎలర్జీతో బాధపడుతూ ఉందట. అంతే కాకుండా ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో తనకి ఇబ్బందులు ఎదురయ్యాయని పూనమ్ పేర్కొంది.
తన ఆరోగ్య సమస్యల వల్లే అలా శరీరం ఉబ్బుతోందని, అందుకే అలా కనిపిస్తున్నాను అంటూ పూనమ్ చెప్పుకు రాగా, ఆమెకి కొందరు నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. ముందు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని అంటున్నారు. కాగా, హైదరాబాదులో జరిగిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అదే క్రమంలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ సీఎం చంద్రబాబుకు ఓ విశిష్ట కానుక అందించారు.