oonam Kaur | నటి పూనం కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఈ పంజాబీ బ్యూటీకి తెలుగులో మంచి గుర్తింపు ఉంది అని చెప్పవచ్చు. అయితే ఈ భామ ఈ మధ్య వరుసగా దర్శకుడు త్రివిక్రమ్‌ని విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు. ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారు. అంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదిలావుంటే తాజాగా పోసాని కృష్ణ మురళి అరెస్ట్‌పై పూనం కౌర్ స్పందిస్తూ.. ఈ విషయంలో కూడా త్రివిక్రమ్‌ను లాగి మరోసారి అతడిపై ఆరోపణలు చేసింది.
సోషల్ మీడియా వేదికగా పూనం స్పందిస్తూ.. పోసాని కృష్ణ మురళి చేసిన మరో తప్పు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఇండస్ట్రీలోకి తీసుకురావడం అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పూనమ్ కౌర్ గతంలోనూ త్రివిక్రమ్‌పై పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. ఆమె తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులకు త్రివిక్రమ్ కారణమని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కి ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని గతంలో పేర్కొంది.