PriyankaChopra | గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్ నుంచి దొరికిన చిన్న విరామాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ షూటింగ్లో నిమగ్నమై ఉండగా, ఆదివారం షూటింగ్‌కు సెలవు దినం కావడంతో తనదైన శైలిలో సేదదీరారు.
ఇందులో భాగంగా పూల్ సైడ్ బ్లూ బికినీ మరియు రోబ్‌లో రిలాక్స్ అవుతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, చాలా కాలం తర్వాత ఒక ఆదివారం తనకు నిజమైన విరామంగా అనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పూల్ దగ్గర కూర్చుని ఉప్పు, కారం చల్లిన పచ్చి మామిడికాయ ముక్కలను ఎంతో ఇష్టంగా తింటున్న వీడియోను పోస్ట్ చేయడంతో, ఆమెలోని ‘దేశీ గర్ల్’ వైబ్స్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రియాంక, అమెరికాలో ఉన్న తన భర్త నిక్ జోనస్ మరియు కుమార్తె మాల్తీ మేరీలతో వీడియో కాల్ ద్వారా సుదీర్ఘంగా ముచ్చటించారు. ఈ క్రమంలో మాల్తీ తన తండ్రి నిక్కు నీళ్లు తాగిస్తూ సహాయం చేస్తున్న క్యూట్ ఫోటో నెటిజన్ల మనసు గెలుచుకోగా, మరో ఫోటోలో మాల్తీ తన నానమ్మ మధు చోప్రాతో కలిసి ఆడుకుంటూ కనిపించింది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. ఏప్రిల్ 7, 2027న విడుదల కానున్న ఈ సినిమా కోసం అటు మహేష్ అభిమానులు, ఇటు ప్రియాంక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra

Priyanka Chopra