సినీ ఇండస్ట్రీ లో దర్శకనిర్మాతలకు మోస్ట్‌వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో టాప్‌లో ఉంటుంది పూజాహెగ్డే (Pooja Hegde). ప్రత్యేకించి పూజాహెగ్డే డేట్స్ కోసం తిరిగే టాలీవుడ్ (Telugu cinema) దర్శకనిర్మాతలు చాలా మందే ఉంటారు. కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ఫుల్ స్పీడుమీదుంది సిల్వర్ స్క్రీన్ బుట్టబొమ్మ. భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. సినిమాల విషయంలోనూ, సోషల్ మీడియా అంశంలోనూ ఎప్పుడూ చురుకుగా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తుంటుంది పూజా.
ఈ బ్యూటీ తాజాగా బ్రౌన్ కలర్ షార్ట్ డ్రెస్, కలర్‌ఫుల్ టాప్‌లో హాట్ లుక్‌లో క్లీవేజ్ షో చేస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హెయిర్ ఫ్రీ లుక్‌తో చిరునవ్వులు చిందిస్తూ కెమెరా స్టన్నింగ్ ఫోజులిచ్చి నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం పూజాహెగ్డే పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న జనగణ మన చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
మరోవైపు సల్మాన్‌ఖాన్ నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళిలో హీరోయిన్గా నటిస్తోంది పూజాహెగ్డే. దీంతోపాటు రోహిత్‌శెట్టి, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సర్కస్‌లో కూడా నటిస్తోంది.