Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
Malaria vaccine | మలేరియా (Malaria) మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించడం కోసం భారత్ బయోటెక్ కంపెనీ (Bharat Biotech Company ) కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ సంస్థలు ‘గవి (Gavi)’, ‘యునిసెఫ్ (UNICEF)’ తో కలిసి మలేరియా వ్యాక్సిన్ (Malaria vaccine) ధరను దాదాపు 40 శాతం తగ్గించేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
Malaria vaccine : మలేరియా (Malaria) మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించడం కోసం భారత్ బయోటెక్ కంపెనీ (Bharat Biotech Company) కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ సంస్థలు ‘గవి (Gavi)’, ‘యునిసెఫ్ (UNICEF)’ తో కలిసి మలేరియా వ్యాక్సిన్ (Malaria vaccine) ధరను దాదాపు 40 శాతం తగ్గించేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ప్రస్తుతం ఒక్క డోసుకు 9.30 యూరోలుగా ఉన్న ధర 5.50 యూరోలకు తగ్గనుంది. భారత కరెన్సీ (Indian Currency) లో ఇది సుమారు రూ.600 లోపే ఉంటుంది.
ఈ తగ్గింపు ధర 2027 ప్రారంభం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో 2027-2029 మధ్య చిన్నారుల టీకా కార్యక్రమాలకు దాదాపు 50 మిలియన్ డాలర్లు ఆదా కానున్నాయి. ఈ నిధులతో మరో 10 లక్షల మంది పిల్లలకు మలేరియా వ్యాక్సిన్ అందించవచ్చని అంచనా. భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను ‘మాస్కివాక్’ పేరుతో తయారు చేస్తున్నది. దీని అసలు పేరు ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01. జీఎస్కే, పాత్ సంస్థలు, వాటి భాగస్వాములు ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి.
2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చిన్నారుల్లో మలేరియా నివారణ కోసం విస్తృత వినియోగానికి ఈ వ్యాక్సిన్‌ను సిఫారసు చేసింది. ప్రస్తుతం దీని తయారీ బాధ్యతలను జీఎస్కే నుంచి భారత్ బయోటెక్‌కు బదిలీచేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, మరిన్ని దేశాలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. ఈ వ్యాక్సిన్‌ను నాలుగు డోసుల కోర్సుగా ఇస్తారు. మలేరియా వ్యాప్తి కాలానుగుణంగా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సరైన సమయంలో నాలుగు డోసులు తీసుకుంటే మలేరియా కేసులు సుమారు 75 శాతం తగ్గే అవకాశం ఉందని యునిసెఫ్ తెలిపింది.
అయితే ఈ వ్యాక్సిన్ పూర్తిస్థాయి రక్షణ ఇవ్వదు. దోమతెరలు వాడటం, దోమల నియంత్రణ చర్యలు చేపట్టడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం కూడా అవసరం. ప్రపంచవ్యాప్తంగా 2024లో సుమారు 28.2 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధితో 6.10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధిక మరణాలు ఆఫ్రికాలోనే సంభవించాయి. ఆ ప్రాంతంలో ఐదేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం 25 ఆఫ్రికా దేశాల్లో సాధారణ టీకా కార్యక్రమాల్లో మలేరియా వ్యాక్సిన్‌ను చేర్చారు. యునిసెఫ్ ఇప్పటివరకు 7.4 కోట్లకు పైగా డోసులను సేకరించి పంపిణీ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

