US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే 96 గంటల్లోనే ఇరాన్‌పై దాడి చేసేందుకు పశ్చిమాసియాలో తమ దళాలు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ నివేదికను సీఎన్ఎన్ మీడియా సంస్థ పేర్కొన్నది. ఎనర్జీ, న్యూక్లియర్ కేంద్రాలపై కూడా దాడులకు అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. మధ్యంతర ఎన్నికల తర్వాత జరిగే ఆ దాడులకు ఇజ్రాయెల్ కూడా సహకరించనున్నది.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు అందిన 96 గంటల్లోనే ఇరాన్‌పై దాడులు(US Strikes) చేసేందుకు పశ్చిమాసియాలో దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. పశ్చిమాసియా ప్రాంతంలో సమృద్ధిగా తమ దళాలను మోహరించినట్లు ఇద్దరు అధికారులు సీఎన్ఎన్ మీడియాతో తెలిపారు. ఇరానీ రేడార్లు, మిస్సైల్ లాంచర్లు మాత్రమే కాకుండా ఇతర మౌళికసదుపాయాలను టార్గెట్ చేసేందుకు అమెరికా సంసిద్దమైనట్లు తెలుస్తోంది. దాడులు ఎప్పుడు చేయాలన్న నిర్ణయం ట్రంప్ చేతుల్లో ఉందని, ఆయన ఆదేశాలను అనుసరించి చర్యలు ఉంటాయని అమెరికా అధికారులు చెప్పారు.
అయితే ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా ఆ ఆదేశం రావొచ్చు అని అన్నారు. దాదాపు మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఆదేశాలు అందే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అయితే అమెరికా మిలిటరీ వ్యూహాలను ఇరానీ దళాలు సలువుగానే అర్థం చేసుకుంటున్నట్లు అమెరికా అధికారులు అంగీకరించారు. కానీ ఈ సారి విస్తృత స్థాయిలో టార్గెట్లను సెట్ చేసినట్లు పెంటగాన్ చెబుతోంది. ఇరానీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ సైట్స్, న్యూక్లియర్ ఫెసిలిటీలను టార్గెట్ చేయాలని భావిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాడ్ చెప్పింది.
మధ్యంతర ఎన్నికల తర్వాత చేపట్టబోయే వ్యూహాల గురించి ఇంకా ట్రంప్ ఆలోచన చేయలేదని మీడియా సంస్థతో ఆ అధికారులు వెల్లడించారు. వైట్‌హౌజ్ మాత్రం ఈ నివేదికపై స్పందించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

