Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
Cyclone Arnab | బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన 'అర్నాబ్ తుపాను (Arnab Cyclone)' తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో పర్యాటకుల (Tourists) భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల (Papi Kondalu) విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి గోదావరి నది (Godavari River) లో పర్యాటక బోట్ల (Tourist Boats) రాకపోకలను పూర్తిగా రద్దుచేస్తూ రంపచోడవరం సబ్-కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
Cyclone Arnab : బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన ‘అర్నాబ్ తుపాను (Arnab Cyclone)’ తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో పర్యాటకుల (Tourists) భద్రతను దృష్టిలో ఉంచుకుని పాపికొండల (Papi Kondalu) విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి గోదావరి నది (Godavari River) లో పర్యాటక బోట్ల (Tourist Boats) రాకపోకలను పూర్తిగా రద్దుచేస్తూ రంపచోడవరం సబ్-కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
తుపాను ప్రభావంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైనగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి సర్వీసులు నడిపే సుమారు 16 పర్యాటక బోట్లను నిలిపివేశారు. గతంలో గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా సుమారు 70 రోజులపాటు నిలిచిపోయిన పాపికొండల యాత్ర, కేవలం రెండు వారాల క్రితమే తిరిగి ప్రారంభమైంది.
అప్పుడే పర్యాటకుల రాక కూడా పుంజుకుంటోంది. ఆదివారం ఒక్కరోజే మూడు బోట్లలో దాదాపు 199 మంది పర్యాటకులు పాపికొండల అందాలను వీక్షించారు. ఇంతలోనే తుపాను ముప్పు ముంచుకు రావడంతో యాత్రకు మరోసారి బ్రేక్ పడింది. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిన తర్వాత, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారితేనే బోటింగ్ సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టంచేశారు. పర్యాటకులు ప్రస్తుతానికి గోదావరి నదీ ప్రాంతాలకు రావొద్దని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

