అందం, అభినయంతోపాటు డ్యాన్స్ తో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది సాయిపల్లవి (Sai Pallavi). సోషల్‌మీడియా ద్వారా అప్పుడప్పుడు తన ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది. తన సోదరి పూజాకణ్ణన్ (Pooja Kannan)తో కలిసి సరదా సమయాన్ని గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటుంది. మరోవైపు పూజా కణ్ణన్ కూడా నెట్టింట్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవలే సాయిపల్లవి సారంగదరియా పాటకు పూజా కణ్ణన్ స్టెప్పులేసిన వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది.
ఎప్పుడెప్పుడు పూజా కణ్ణన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరుస్తుందా..? అని ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చింది. పూజా కణ్ణన్ డెబ్యూ సినిమా చిథిరై సెవ్వనమ్ (Chithirai Sevvanam) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను ధనుష్ షేర్ చేస్తూ..సెల్వ టీంకు శుభాకాంక్షలు తెలియజేశాడు. కోలీవుడ్ నటుడు సముద్రఖని (Samuthirakani) కూతురుగా పూజాకణ్ణన్ నటిస్తోంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోంది. యాక్షన్ కొరియోగ్రఫర్ సిల్వ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతుండటం విశేషం. సాయిపల్లవి, పూజాకణ్ణన్ చూడటానికి కవల పిల్లల్లా కనిపిస్తుంటారు.
1st Look of #ChithiraiSevvaanam Directed by my dear friend @silvastunt, Wishes to him for Venturing in KTown as a Director
— Dhanush (@dhanushkraja) November 21, 2021
Starring @thondankani @rimarajan #PoojaKannan
Presented by Dir #Vijay@Vairamuthu @SamCSmusic
A #Zee5 @ZEE5Tamil Exclusive film Premieres on Dec 3👆🏻 pic.twitter.com/TR7IBT1GSL
పూజాకణ్ణన్ ఏఎల్ విజయ్ (AL Vijay) దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్టు చాలా మందికి తెలియదు. కారా అనే షార్ట్ ఫిలింలో కూడా నటించింది పూజాకణ్ణన్. జీ5లో డిసెంబర్ 3న ప్రీమియర్ కానుంది. మరి పూజా కణ్ణన్ వెండితెరపై ఎలా ఆకట్టుకుందో చూడాలి. పల్లెటూరి పాత్రల్లో సహజసిద్దంగా కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు పూజా-సముద్రఖని.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్