Pooja Hegde | కన్నడ భామ పూజాహెగ్డే కెరీర్ తొలినాళ్లలోనే అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకొని సత్తా చాటింది. ముఖ్యంగా తెలుగునాట యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ భామకు అదృష్టం ఏమాత్రం కలిసి రావడం లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో ఆమె నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా మిగిలాయి. దీంతో పూజాహెగ్డే కెరీర్ ఇక ముగిసినట్లే అని భావించారు. కానీ ఈ భామ అనూహ్యంగా పుంజుకుంది.
తెలుగు, తమిళంలో భారీ అవకాశాలను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరచింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఐదు చిత్రాలున్నాయి. తమిళంలో సూర్య, విజయ్ 69 చిత్రాల్లో ఈ అమ్మడు కథానాయికగా ఖరారైంది. అలాగే బాలీవుడ్లో షాహిద్‌కపూర్ సరసన ‘దేవ’ చిత్రంలో నటించనుంది. ఇలా వరుస భారీ ఆఫర్లతో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నాలో ఉంది పూజాహెగ్డే. ఫెయిల్యూర్స్ వల్ల ఎప్పుడూ బాధపడలేదని, మంచి సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూశానని, భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేసింది పూజాహెగ్డే.