జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ చిత్రాల్లో ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ తమిళంలో జననాయగన్, కాంచన-4 వంటి చిత్రాల్లో భాగమవుతున్నది. తాజా సమాచారం ప్రకారం పూజాహెగ్డే మరోమారు అల్లు అర్జున్‌తో కలిసి సందడి చేయనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే… అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఫిక్షన్ చిత్రమిదని సమాచారం.
దీపికా పదుకొణె కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో పూజాహెగ్డే నర్తించనుందని తెలిసింది. డీజే, అలవైకుంఠపురములో వంటి చిత్రాల ద్వారా బన్నీ, పూజాహెగ్డే సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీరిద్దరు స్క్రీన్‌షేర్ చేసుకోబోతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.