సినీరంగంలో హీరోలతో పోల్చుకుంటే నాయికల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఫ్లాఫులు పలకరిస్తే సదరు కథానాయికల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ ఈ ట్రెండ్‌కు భిన్నంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నది మంగళూరు సోయగం పూజాహెగ్డే. గత మూ డేళ్లుగా ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇటీవల వచ్చిన ‘రెట్రో’ సైతం డిజాస్టర్‌గా నిలిచింది.
వరుస ఫ్లాఫ్లు వచ్చినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తున్నది పూజాహెగ్డే. కెరీర్లో ఇదొక బ్యాడ్‌ఫేజ్ అని, కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నది. అందుక్కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే. రజనీకాంత్ ‘కూలీ’లో అతిథి పాత్రలో కనిపించనుంది.
ఇక దళపతి విజయ్‌తో కలిసి నటిస్తున్న ‘జన నాయగన్’పై తమిళనాట భారీ అంచనాలున్నాయి. రాజకీయ రంగప్రవేశం దృష్ట్యా విజయ్ నటిస్తున్న చివరి చిత్రమిదే కావడంతో బ్లాక్‌బస్టర్ గ్యారంటీ అంటున్నారు. దీనితో పాటు తమిళంలో పూజాహెగ్డే ‘కాంచన-4’లో నాయికగా నటిస్తున్నది. ఆ ప్రాజెక్ట్‌పై అంచనాలున్నాయి. ఈ సినిమాలతో తన కెరీర్ గాడిలో పడుతుందని, ఓ ఏడాది ఓపిక పడితే చాలు ఇక విజయాలే అంటున్నది పూజాహెగ్డే.