బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సల్లూభాయ్ స్టైలిష్ లుక్‌లో ఎప్పుడూ ఒక వస్తువు స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తుంటుంది. ఆ వస్తువేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. సల్మాన్ చేతికున్న బ్రాస్లెట్ (bracelet). ఇంతకీ బ్రాస్ లెట్ టాపిక్ ఎందుకొచ్చిందనుకుంటున్నారా..? సల్మాన్ చేతికుండాల్సిన ఈ బ్రాస్ లెట్ టాలీవుడ్ భామ పూజాహెగ్డే (Pooja Hegde) చేతికి కనిపిస్తుంది. ఇపుడీ స్టిల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
పూజాహెగ్డే ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కభి ఈద్ కభి దివాళి (Kabhi Eid Kabhi Diwali) ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫర్హద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా తెరకెక్కిస్తున్నారు. కాగా సల్మాన్ ఖాన్ బ్రాస్ లెట్ పెట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేస్తూ..సినిమా షూటింగ్ మొదలైందంటూ క్యాప్షన్ ఇచ్చింది పూజాహెగ్డే. ముంబై విలే పార్లేలోని గోల్డెన్ టొబాకో ఫ్యాక్టరీలో ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం.
ఈ చిత్రంలోఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ తో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ మూవీలో టాలీవుడ్ (Tollywood)హీరో వెంకటేశ్ (Venkatesh) కీ రోల్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.
పూజాహెగ్డే (Pooja Hegde)కు సోదరుడి పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడని..వార్తలు వస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు వెంకీ, వరుణ్ తేజ్ నటిస్తోన్న ఎఫ్ 3 చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తోంది పూజాహెగ్డే.