పూజా హెగ్డే టీచర్ అవతారం ఎత్తింది. వైట్ బోర్డ్‌మీద స్కెచ్‌పెన్‌తో స్టూడెంట్స్‌కి గణితంతోపాటు ఇతర సబ్జెక్టులను కూడా బోధిస్తున్నది. పాపం.. సినిమాలు తగ్గడంతో లెక్చరర్ ఉద్యోగంలోకి దిగిందని అనుకుంటున్నారా!? అసలు సినిమాలు తగ్గిందీ లేదూ.. తను లెక్చరర్ అయ్యిందీ లేదూ. షూటింగ్ విరామంలో ఇలా టీచర్ అవతారం ఎత్తి అక్కడున్న యువతని అలరించింది. ఆ వీడియోను అలాగే ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. ‘ ఏం చెబుతున్నావ్?.. అని అడక్కండి. ఎందుకంటే అదేమిటో నాకే తెలీదు’ అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూజా జోరుకు ఫ్యాన్సందరూ ఫిదా అయిపోతున్నారు. ‘అందమైన ఫొటోలతోనే కాకుండా.. అల్లరి వీడియోలతో కూడా మా హృదయాలను దోచేస్తున్నావ్.’ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏ సినిమా షూటింగ్ విరామంలో ఈ వీడియో చేసింది? అనేది మాత్రం తెలియాల్సివుంది. ఇదిలావుంటే ప్రస్తుతం పూజా హెగ్డే కెరీర్ మంచి జోష్ మీద ఉంది. బాలీవుడ్లో విరివిగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నది ఈ అందాలభామ. ప్రస్తుతం బాలీవుడ్లో ‘దేవా’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ‘హౌస్‌ఫుల్-5’, ‘షీ వాక్స్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లకు కూడా సైన్ చేసేసింది పూజా. తెలుగులో కంబ్యాక్ కోసం సీరియస్‌గానే ట్రై చేస్తున్నదని టాక్.