ఫిలిం జర్నలిస్ట్ ఉమైర్ సంధు, కథానాయిక పూజా హెగ్డే మధ్య నిశ్శబ్ద యుద్ధమే నడుస్తున్నట్టుంది. గతంలో తనపై నెగెటివ్ కామెంట్లు చేసినందుకుగాను ఉమైర్‌కు కోర్ట్ నోటీసులు పంపించింది పూజా హెగ్డే. ఇప్పుడు ఉమర్ మరో అడుగు ముందుకేసి పూజాహెగ్డే కెరీర్‌పై వ్యక్తిగత సోషల్‌మీడియాలో నెగెటివ్ కామెంట్ పోస్ట్ చేశాడు. ‘ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా హవా చూపించిన పూజాహెగ్డే, ఇప్పుడు సినిమాల్లేక దర్శక, నిర్మాతలకు ఫోన్లు చేసి మరీ అవకాశాలు అడుక్కుంటున్నది’ ఇది ఆ పోస్ట్ సారాంశం.
ఈ పోస్ట్‌పై ప్రస్తుతానికైతే పూజా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే.. ఆమె అభిమానులు మాత్రం ఉమైర్‌పై ఘాటుగానే స్పందిస్తున్నారు. ‘గుంటూరుకారం’ సినిమా నుంచి పూజాను తప్పించినప్పట్నుంచీ ఆమె కెరీర్ కష్టాల్లో పడిందని పలువురి అభిప్రాయం. నిజానికి అందంలోగానీ, అభినయంలోగానీ పూజా ది బెస్ట్. త్వరలోనే మళ్లీ పూర్వవైభవం ఈ బుట్టబొమ్మకు రావడం ఖాయం అని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.