Arya 2 Re Release | అల్లు అర్జున్ నటించిన క్లాసిక్ చిత్రాలలో ఆర్య 2 (Arya 2) ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్యకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం 2009లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా.. కాజల్ ఆగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమా వచ్చి 16 ఏండ్లు అవుతున్న సందర్భంగా మూవీని నేడు రీ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్, సుదర్శన్ థియేటర్ల వద్ద భారీ బందోబస్త్‌ని ఏర్పాటు చేశారు మేకర్స్.
పుష్ప 2 ది రూల్ విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట కారణంగా మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కావోద్దని పోలీసులు ముందే థియేటర్ ముందు మోహరించినట్లు తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పుష్ప 2 ఘటన
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్(Pushpa 2 the rule) సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ (Sandya Theatre Stampede) వద్ద తొక్కిసలటా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయ్యి జైలుకి కూడా వెళ్లి వచ్చాడు.
Police on High Alert at Sandhya and Sudarshan Theatres!!#Arya2 #Arya2ReRelease #AlluArjun pic.twitter.com/sw7Rc7w1WN
— Movies4u Official (@Movies4u_Officl) April 5, 2025