Allu Arjun | పుష్ప2 చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన అల్లు అర్జున్‌కి ఆ ఆనందం ఎంతో సేపు మిగలలేదు. ఆయన నటించిన ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో భారీ తొక్కిసలాట జరగగా, ఆ ఘటనలో ఓ మహిళ మరణించింది. బాబుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ కొన్ని గంటల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ మీద ఉన్నారు. అయితే ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదైంది.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ అల్లు అర్జున్‌తో పాటు,హీరోయిన్ శ్రీలీలపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో ఏఐఎస్ఎఫ్.. అల్లు అర్జున్, శ్రీలీల పలు కార్పొరేట్ విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. వారు ఆయా కళాశాలల విద్యా ప్రమాణాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. దీని వలన విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్పొరేట్ కళాశాలల నుండి భారీ పారితోషికం తీసుకుంటూ, విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా అల్లు అర్జున్ , శ్రీలీల ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ పోలీసులను కోరింది.
దేనికైన ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా? చెడ్డవా? అనేది ఆలోచించరా అని మండిపడ్డారు. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపింది. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తా పత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు పలు యాడ్స్ రిలీజ్ చేయగా, ఒక కాలేజీలో ఉన్న విద్యార్ధి వేరొక కాలేజ్‌కి కూడా యాడ్ ఇచ్చింది. ఇలా ఒకే విద్యార్ధి.. వేర్వేరు కాలేజీలు.. వేర్వేరు యాడ్లు.. వేర్వేరు ర్యాంకులుగా ప్రమోట్ చేస్తూ తల్లిదండ్రులని మోసం చేస్తున్నారు. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఐఎస్ఎఫ్ విమర్శించింది.