వినయ్‌కుమార్, శ్రావణి, అరవింద్, నోమిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాలమేగా కరిగింది’. ‘కలహాలే లేని ఓ ప్రేమకథ’ ఉపశీర్షిక. సింగార మోహన్ దర్శకుడు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘పొయెటిక్ లవ్‌స్టోరీ ఇది. అందమైన భావనలతో హృద్యంగా సాగుతుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: వినీత్ పబ్బతి, సంగీతం: గుడప్పన్, నిర్మాత: మరే శివశంకర్, రచన-దర్శకత్వం: సింగార మోహన్.