Modi Hai Toh Mumkin Hai Song Troll | భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా మోదీని కీర్తిస్తూ ఒక పాట విడుదల కాగా.. ఆ పాటకు దాదాపు 3 లక్షలకు పైగా డిస్‌లైక్‌లు (వ్యతిరేకంగా) వచ్చాయి.
ప్రధాని మోదీ రాజకీయ రంగంలో కీలక పదవుల్లో సేవలందిస్తూ ఇటీవల 25 ఏళ్ల మైలురాయిని అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2000లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై, 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతూ మోదీ జీ ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. అయితే మోదీ నాయకత్వాన్ని కీర్తిస్తూ బాలీవుడ్‌కి చెందిన స్టార్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఒక పాటను విడుదల చేసింది. ‘మోదీ హై తో ముంకిన్ హై’ (Modi Hai Toh Mumkin Hai) అనే పాటను విడుదల చేయగా.. ఇందులో మోదీ పాలన గురించి వివరించారు. అయితే ఈ ప్రచార గీతం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది. ఇది ‘పొలిటికల్ ప్రాపగాండా’ అని ప్రజల పన్ను డబ్బును (Tax Payers Money) ప్రధాని గత 11 ఏండ్లుగా వృథా చేస్తున్నాడని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ పాట మరో రికార్డును అందుకుంది.
యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు వారం రోజుల్లోనే లక్షకు పైగా డిస్‌లైక్‌లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రికార్డును మళ్లీ చెరిపివేస్తూ.. తాజాగా 3 లక్షలకు చేరింది. ప్రస్తుతం ‘మోదీ హై తో ముంకిన్ హై’ పాటను 35 వేల మంది లైక్ చేయగా.. 3 లక్షల 13 వేల మంది డిస్లైక్ (వ్యతిరేకంగా)బటన్ని లైక్ చేశారు. దీంతో మోడీపై వ్యతిరేకత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు కామెంట్లు పెడుతున్నారు.
Modi Toh Mumkin Hai