Silent Political Party | తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతున్న పంది ముఖం పోస్టర్లు.. మాజీ ఎంపీ కొత్త వ్యూహం?
Telugu States | రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా పంది ముఖాన్ని పోలిన పోస్టర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రోజువారీ దినపత్రికల్లో ఈ పోస్టర్లు కనిపించడంతో ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా పంది ముఖాన్ని పోలిన పోస్టర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రోజువారీ దినపత్రికల్లో ఈ పోస్టర్లు కనిపించడంతో ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఒక మాజీ ఎంపీ కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, తనదైన శైలిలో పావులు కదపడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ పేరుతో ఖాతాలను కూడా తెరిచినట్లు సమాచారం.
అయితే, ఈ ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’ ప్రధాన ఉద్దేశం ఏమిటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంది ముఖాన్ని మాస్క్‌గా ధరించడం ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? గతంలో వినిపించిన కాక్రోచ్ పార్టీ వంటి వాటికి పోటీగా దీనిని తీసుకువస్తున్నారా? ఎవరిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగబోతున్నారు? అనే విషయాలు ప్రస్తుతానికి స్పష్టంగా తెలియడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పోస్టర్లు ఎందుకు ప్రచారంలోకి వచ్చాయనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. ఆ మాజీ ఎంపీ ఎవరు, ఆయన వెనుక ఉన్న శక్తులు ఎవరనే వివరాలు మరికొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Breaking News | డిసెంబర్ 11న థియేటర్లలో సందడి చేయనున్న ‘ది బ్రేకింగ్ న్యూస్’!
నవీన్ నాయక్ ప్రాణ త్యాగానికి జాతీయ గుర్తింపు
Man Attacks Police With Knife | ఐదుగురు పోలీసులపై కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఎన్కౌంటర్లో గాయాలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్‌కు దళితుల ఫిర్యాదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

