‘విరూపాక్ష’ విజయంతో వందకోట్ల హీరోగా అవతరించారు సాయిదుర్గతేజ్. ఆయన హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా ఇటీవలే మొదలైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకుడు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. అదో ఎడారి.. దాని నిండా ల్యాండ్మైన్లు.. మధ్యలో పచ్చని చెట్టు.. అందర్నీ ఆకర్షించేలా పోస్టర్ ఉంది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతున్నదని, గ్రాండ్ స్కేల్‌తో, భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించనున్నామని, పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయిదుర్గతేజ్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకోసం వేసిన భారీ సెట్లో తొలిషెడ్యూల్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.