బాలీవుడ్ అగ్రతార దీపిక పదుకోణ్ తన కెరీర్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇకనుంచి యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా తన ఇమేజ్‌ని రీ డిజైన్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నది ఈ అందాలభామ. కొత్త ఆడియన్స్‌ని ఆకర్షించేందుకే దీపికా ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నదని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. ఇందులో భాగంగా ఆమె బడ్జెట్ గురించి, బ్యానర్ గురించి ఆలోచించకుండా కేవలం పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ కథలు వింటున్నదట.
మరోవైపు మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు కూడా దీపిక మొగ్గు చూపుతున్నదని బీటౌన్ టాక్. అలాగే.. తన భర్త రణ్‌వీర్‌సింగ్ నటిస్తూ నిర్మిస్తున్న జాంబి యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’ చిత్రంలో నటించేందుకు కూడా దీపిక ఆసక్తి చూపిస్తున్నదట. సొంత సినిమా కావడంతో పారితోషికం కూడా వద్దనుకుందట. కొత్త జానర్స్పై ఆసక్తి చూపడంలో భాగమే ఇదంతా అని ఆ చిత్ర మేకర్స్ అంటున్నారు. మొత్తంగా ఓవర్ స్కిన్‌షోకు దూరంగా, క్వాలిటీకి దగ్గరగా ఉండాలని దీపిక ఫిక్సయినట్లు తెలిసింది.