బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం 1994లో హాలీవుడ్లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం కార్గిల్, లడఖ్, శ్రీనగర్ లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకోగా, తాజాగా కోనసీమకి షిఫ్ట్ అయింది. అల్లవరం మండలం కోడూరు పాడులో ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
కోనసీమ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమీర్ ఖాన్ కు చిరుసత్కారం జరగగా, ఆ తర్వాత ఆయన షూటింగ్లో పాల్గొన్నారు.ఆమిర్ వచ్చాడని తెలిసి ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వారందరికి ఆమిర్ అభివాదం చేశాడు. వారం రోజుల పాటు కోనసీమలో చిత్ర షూటింగ్ చేయనున్నాడు దర్శకుడు అద్వైత్ చందన్.
ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్ బాలాగా కనిపించగా ఆమిర్ లాల్ సింగ్ పాత్ర పోషించాడు. కామెడీ-డ్రామా జానర్లో రాబోతున్న చిత్రంలో కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో చైతూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.