శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘పెళ్లిలో పెళ్లి’. శ్రీకాంత్ సంబరం ఈ చిత్రానికి దర్శకుడు. గణేష్ కోలి నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. యువహీరో ఆకాష్ జగన్నాథ్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు.
ఈ సినిమా కచ్ఛితంగా విజయం సాధిస్తుందని నటుడు తనికెళ్ల భరణి నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమాకు పాటలు, నేపథ్య సంగీతం బాగా కుదిరాయని సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా అన్నారు. ఈ సినిమాలో నటించడం పట్ల హీరో శివ సాయిరిషి, హీరోయిన్ సంస్కృతి గోరే, నటి దవిజ ఆనందం వెలిబుచ్చారు. టీమ్ అందరికీ పేరు తెచ్చే సినిమా ఇదని నిర్మాత గణేష్ కోలి చెప్పారు. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే షోలాపూర్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా ఇదని, ఇదో భావోద్వేగ ప్రయాణమని దర్శకుడు శ్రీకాంత్ సంబరం తెలిపారు.