Pranaya Godari | మల్టీ టాలెంటెడ్ యాక్టర్ సాయికుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’ (Pranaya Godari). పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతోంది. సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ప్రణయగోదారి టైటిల్ తనకు బాగా నచ్చిందని… చాలా పాజిటివ్‌గా అనిపించిందన్నారు. సినిమాల్లో చిన్నా పెద్దా అనే తేడా ఉండదు. పెళ్లి చూపులు తక్కువ బడ్జెట్‌తో తీసినా అది పెద్ద హిట్ అయింది. డిసెంబర్ 13న విడులవుతున్న సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.
ఈ సినిమా తెరకెక్కించేందుకు చాలా కష్టపడ్డా. మా బ్రదర్ మార్కండేయ కోసం ఈ సినిమా చేశా. మంచి సినిమా ప్రోత్సహించాలని పీఎల్ విఘ్నేశ్ విజ్ఞప్తి చేశాడు. ఈ చిత్రాన్ని పీఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య తెరకెక్కిస్తున్నారు.
Experience the Love Drama #Pranayagodari film in theatres from 13th December#sadan #priyankaprasad #saikumar #30YearsPrithvi#JabardastRajamouli #SunilRavinuthala#PLVignesh#ParamallaLingaiah #PLVCreations#Markandeya #BhargaviPillai#EdaraPrasad pic.twitter.com/nAqgSzJeDI
— Sai Satish (@PROSaiSatish) December 10, 2024
Game Changer | అందమైన లొకేషన్లలో రాంచరణ్, కియారా అద్వానీ.. నానా హైరానా సాంగ్ షూట్ సాగిందిలా..!
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్