‘ ‘పెద్ది’ 40ఏండ్ల క్రితం విజయనగరంలో జరిగే కథ. అప్పటి విజయనగరాన్ని చూపించాలి. అదంతా ఒక ఇమేజినేషన్. రిఫరెన్స్ కోసం కొన్ని ఇమేజస్ తీసుకొని పకడ్బందీగా వర్క్ చేశాం. క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ.. ఇలా ప్రతి అంశాన్నీ పరిశీలనాత్మకంగా నిర్మిస్తూ వెళ్లాం. కొండ ప్రాంతాలు, అక్కడి ప్రజలు, వారి ైస్టెల్.. ఇలా ప్రతీది ఆర్గానిక్‌గా డిజైన్ చేశాం. 40ఏండ్ల నాటి వాతావరణాన్ని ఆవిష్కరించడం కోసం ఓ సరికొత్త టింట్‌ని ట్రై చేశాం. రియలిస్టిక్ ఫీల్ ఉన్న విజువల్సే ‘పెద్ది’లో కనిపిస్తాయి’ అని ప్రముఖ ఛాయాగ్రహకుడు ఆర్.రత్నవేల్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకుడిగా రానున్న పానిండియా చిత్రం ‘పెద్ది’కి ఆయన ఛాయాగ్రహణం అందించారు. జూన్ 4న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ‘పెద్ది’ విశేషాలను మంగళవారం విలేకరులతో రత్నవేల్ పంచుకున్నారు. ‘ఎడిటింగ్ సెషన్ తర్వాత, రామ్‌చరణ్‌కీ, నాకూ నేషనల్ అవార్డ్స్ వస్తాయని డైరెక్టర్ బుచ్చిబాబు అన్నారు.
చాలా ఆనందం అనిపించింది. బుచ్చిబాబు సినిమాను అద్భుతంగా తెరపైకి తెచ్చాడు. సినిమాలో వచ్చే సెకండ్ క్రికెట్ మ్యాచ్ కథలో కీలకం. ఆ ఎపిసోడ్ చేయడం కాంప్లికేటెడ్‌గా అనిపించింది. అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు. కథకు మలుపు. ఆ మ్యాచ్‌ని రాత్రిపూట షూట్ చేయమని బుచ్చిబాబుకి సూచించాను. 80ల్లో ఫ్లడ్‌లైట్ మ్యాచ్‌లు జరిగేవి. ఆ ఫీల్ కోసం నైట్ షూట్ పెట్టించా. నిజంగా అద్భుతంగా వచ్చింది. తెరపై చూస్తున్నప్పుడు అది క్రికెట్ మ్యాచ్‌లా అనిపించదు. రెండు జట్ల మధ్య యుద్ధంలా అనిపిస్తుంది’ అని తెలిపారు రత్నవేల్. ఇంకా చెబుతూ ‘ఇక కుస్తీపోటీల కోసం రామ్‌చరణ్ నిజంగా పహిల్వాన్లా మారారు. ట్రైలర్లో చూస్తే ఆయన ప్రతి మజిల్ కూడా డీటైల్‌గా కనిపిస్తుంది. హనుమంతుడి రిఫరెన్స్‌తో వచ్చే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ కోసం ప్రత్యేకమైన లైటింగ్ డిజైన్ చేశాను. దాంతో రామ్‌చరణ్‌లో ఆడియన్స్ హనుమంతుడ్ని చూస్తారు. థియేటర్లలో ఆ సీన్ వచ్చినప్పుడు గూజ్బంప్స్ ఖాయం. ఇక చివరి 30 నిమిషాలైతే ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. మొత్తంగా ఇందులో రామ్‌చరణ్ విశ్వరూపం చూస్తారు’ అని రత్నవేల్ అన్నారు.