Peddi | టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్న పెద్ది సినిమా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసారు.మే 18న ముంబైలో జరగబోయే ఈవెంట్ ద్వారా ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్‌పై కూడా భారీ స్థాయిలో ఫోకస్ పెట్టిన చిత్ర బృందం, ట్రైలర్ లాంచ్‌ను బాలీవుడ్ మీడియా సమక్షంలో నిర్వహించేందుకు సిద్ధమవడం చర్యనీయాంశం అయింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు ముంబై ప్రధాన ప్రమోషనల్ హబ్‌గా మారిన నేపథ్యంలో ‘పెద్ది’ టీమ్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతోందని తెలుస్తోంది.
ఈ ట్రైలర్ ఈవెంట్‌కు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో సినిమాపై బజ్ పెంచేందుకు ప్రత్యేకంగా మీడియా ఇంటరాక్షన్స్, ఫ్యాన్స్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో హీరో పాత్రను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని మాస్ అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి పెంచింది. గ్రామీణ నేపథ్యంతో పాటు భారీ యాక్షన్ ఎలిమెంట్స్, భావోద్వేగ కథాంశం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ కోసం ప్రత్యేకంగా హై వోల్టేజ్ యాక్షన్ షాట్స్, ఎమోషనల్ డైలాగ్స్‌ను కట్ చేస్తున్నారని సమాచారం.
ముంబైలో ట్రైలర్ లాంచ్ నిర్వహించడం వెనుక మరో ముఖ్య కారణం హిందీ మార్కెట్లో భారీ ఓపెనింగ్స్ సాధించాలనే లక్ష్యమేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవల దక్షిణాది సినిమాలకు ఉత్తరాదిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ భారీ ప్రమోషన్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ‘పెద్ది’పై ఇప్పటికే భారీ చర్చ జరుగుతోంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ముంబై వేదికగా జరగనున్న ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరింత బలంగా నిలబెట్టే ఈవెంట్‌గా మారనుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.