‘పెద్ది’ పాత్ర పోషణకోసం.. తానే ఓ శిల్పిగా మారి, తనకు తాను చెక్కుకుంటున్నారు రామ్‌చరణ్. ఆ పాత్రకు కావాల్సిన దేహ దారుఢ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారాయన. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సమర్పిస్తున్నాయి.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం మైసూర్లో రామ్‌చరణ్ మీద ఒక గ్రాండ్ సాంగ్ షూట్ స్టార్ట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాటను ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. రామ్‌చరణ్‌తోపాటు వెయ్యిమందికి పైగా డాన్సర్లతో చిత్రీకరిస్తున్న ఈ పాట విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని, రామ్‌చరణ్ తన ట్రేడ్ మార్క్ ఎనర్జీ, గ్రేస్‌తో చేసిన మాస్ స్టెప్పులు ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ అగ్ర నటుడు శివరాజ్‌కుమార్ పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నారు. జగపతిబాబు, దివ్వేందు శర్మ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు,.