Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ . గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రా & రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్‌లో చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని షాట్స్ కొడుతున్న సీన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ గ్లింప్స్ ద్వారా పెద్ది చిత్రంలో క్రికెట్ నేపథ్యంలో కూడా కొన్ని కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయని స్పష్టమైంది.
ప్రస్తుతం ఈ సినిమా మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద షూటింగ్ జరుపుకుంటోంది. ఆ తర్వాత యూనిట్ నాసిక్ వెళ్లి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనుంది. ఇప్పటికే మైసూరు, రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లలో పలు షెడ్యూల్స్‌ను పూర్తి చేశారు. తాజా సమాచారం ప్రకారం, క్లైమాక్స్‌లో భారీ క్రికెట్ మ్యాచ్ జరగనుండగా, అందులో రామ్ చరణ్ ఒక ఆటగాడిగా కనిపించి జట్టును గెలిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్ సీన్‌ను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో చిత్రీకరించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మేరకు అక్కడి నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
స్టేడియంలో లైవ్ క్రౌడ్, లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్‌తో రియలిస్టిక్ క్రికెట్ విజువల్స్‌ను చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ కు జోడిగా నటిస్తోంది.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటం మరో విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మార్చ్ 27, 2026న విడుదల కానుంది అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. స్పోర్ట్స్ డ్రామా, మాస్ ఎమోషన్, క్రికెట్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ‘పెద్ది’ సినిమా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. రామ్ చరణ్ కొత్త లుక్, పాత్రలోని ఇంటెన్సిటీ, క్లైమాక్స్ లో క్రికెట్ విజువల్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.