శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న న్యూఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. విరాట్ కర్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘అణచివేత, సంఘర్షణల నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది.
ఓ సామాన్యుడు ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. పవర్ఫుల్ యాక్షన్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగడసాగ, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.