Sai Dharam Tej | సాయిధరమ్ తేజ్ టైంను పవన్ వృధా చేస్తున్నాడా..?
ఆ మధ్య ఒకసారి సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమా లొకేషన్లోకి వచ్చిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ అప్ డేట్ మినహా సాయిధరమ్ షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు.
టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు ఏడాదికిపైగా షూటింగ్స్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఒకసారి సినిమా లొకేషన్లోకి వచ్చిన స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ అప్ డేట్ మినహా సాయిధరమ్ షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు రావడం లేదు. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఒకే చేసిన చిత్రాల్లో పవన్ కల్యాణ్‌తో చేయబోతున్న మల్టీస్టారర్ కూడా ఉంది.
సముద్రఖని దర్శకత్వంలో తమిళ చిత్రం వినోధయ సీతమ్ను తెలుగు (Vinodaya Sitham remake) లో రీమేక్ చేయబోతున్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం జులైలో షురూ కావాల్సింది. కానీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఇప్పటివరకు షూటింగ్ విషయంలో డైలామా కొనసాగుతుంది. మరోవైపు సాయిధరమ్ కూడా ఇంకో సినిమా సెట్స్ కు వెళ్లడం లేదు. పవన్ కల్యాణ్ నుంచి క్లారిటీ వస్తుందేమోనని ఎదురుచూస్తున్నాడట.
ఇప్పటికే మూడు నెలలు గడిచినా..పవన్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో స్పష్టత లేకపోవడంతో టైం అంతా వృధా అవుతుందనే భావనలో ఉన్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తే సాయిధరమ్ ఈ మూడు నెలల్లో పూర్తి చేసేవాడని అంటున్నారు సినీ జనాలు.
మొత్తానికి పవన్ కల్యాణ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా సాయిధరమ్ తేజ్ సమయాన్ని వృధా చేస్తున్నాడని పలువురు మూవీ లవర్స్ తెగ చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికైనా పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా..? లేదంటే సాయిధరమ్ తేజ్ వేరే సినిమాను మొదలుపెడతాడా..? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
Read Also : Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Also : KARAN JOHAR | ఆ వారసుడిపై కన్నేసిన కరణ్ జోహార్..నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు
Read Also : OTT / Theater | ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలివే
Read Also : Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

