వకీల్ సాబ్ చిత్రం తర్వాత వరుస సినిమాలతో సందడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు.కరోనా వలన ఆగిన ఈచిత్ర షూటింగ్ కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది.తాజాగా హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. వారం క్రితమే పవన్‌కు జోడీగా నటిస్తున్న నిత్యామీనన్ సెట్లో అడుగుపెట్టారు.
ప్రస్తుతం పవన్, నిత్యామీనన్‌తో పాటు మురళీశర్మ, కాదంబరి కిరణ్ తదితరులపై పోలీస్ స్టేషన్లో సాగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తైనట్టు తెలుస్తుండగా, సంక్రాంతి బరిలో సినిమాను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేస్తున్నామని ఇటీవల నిర్మాణ సంస్థ వెల్లడించింది. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రానా దగ్గుబాటి. ఐశ్వర్యా రాజేశ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరోవైపు పవన్ ..క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక టీజర్ విడుదల కాగా, ఇది అంచనాలు పెంచింది. చాలా రోజులుగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కాబట్టి ఆ రోజు తప్పక ఒక అప్డేట్ వస్తుందని అంటున్నారు.