టి.డి.ఆర్ సినిమాస్ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ షూటింగ్ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. హీరోహీరోయిన్లు పవన్ కేసరి, కావ్యా కల్యాణ్రామ్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రామ్ అబ్బరాజు క్లాప్ ఇవ్వగా, ప్రశాంత్ కుమార్ దిమ్మెల కెమెరా స్విచాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. రామ్ అబ్బరాజు, ప్రశాంత్ దిమ్మెల, అడిదాల విజయ్‌పాల్‌రెడ్డి స్క్రిప్ట్‌ని దర్శకుడు కుంచెం శంకర్‌కి అందించారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు హీరోహీరోయిన్లు పవన్ కేసరి, కావ్య కల్యాణ్‌రామ్ ఆనందం వ్యక్తం చేశారు.
శంకర్ మంచి కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని, విజయ్ బుల్గానిన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని నిర్మాతలు తలారి దినకరణ్రెడ్డి, తలారి హేమావతిరెడ్డి అన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకుడు తెలిపారు. సంగీతదర్శకుడు విజయ్ బుల్గానిన్ కూడా మాట్లాడారు. సుగుణ, సుప్రియ, దివిజ ప్రభాకర్, మోయిన్ తదితరులు ఇతర పాత్రధారులు.