వకీల్ సాబ్ ఓటీటీ విడుదలకు ఓవర్సీస్ చిక్కులు
వకీల్ సాబ్ ఓటీటీ విడుదలకు ఓవర్సీస్ చిక్కులు | పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల రోజు నుంచి కూడా ఎందుకో తెలియదు.. అనుకోని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ విడుదల రోజు నుంచి కూడా ఎందుకో తెలియదు.. అనుకోని వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. సినిమా విడుదల తర్వాత టికెట్ల రేట్ల విషయంలో ఏపీలో గొడవలు జరిగాయి. ఈ విషయం హైకోర్టు దాకా వెళ్లింది. అయినా సరే సూపర్ హిట్ టాక్‌తో రూ.85 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ లోపు కరోనా ఉద్ధృతి పెరగడంతో థియేటర్లను మూసివేస్తూ తెలంగాణ థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతుంటే ఓవర్సీస్ నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి.

ఏప్రిల్ 9న విడుదలైన వకీల్ సాబ్ 85 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా నిలిచింది. అత్తారింటికి దారేది 82 కోట్లు వసూలు చేస్తే.. ఇప్పుడు వకీల్ సాబ్ ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాను ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. వకీల్ సాబ్ సినిమా ఇంత త్వరగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో వస్తుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి ఈ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్ ఫాంలో వస్తుందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ఖండించాడు. అవన్నీ వట్టి పుకార్లేనని.. 50 రోజుల తర్వాతనే వకీల్ సాబ్ ఓటీటీలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మూడు వారాల తర్వాత సినిమాను ఓటీటీలో విడుదల చేస్తుండటంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి దిల్ రాజు న్యాయపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. తమకు సినిమా అమ్మేటప్పుడు 50 రోజుల తర్వాత డిజిటల్ లో విడుదల చేస్తామని చెప్పారని.. అలాగే అగ్రిమెంట్ కూడా రాశారని తెలిపారు.

ఈ సినిమాను అమెరికాలో ఒక దుబాయ్ సంస్థ కొనుక్కుంది. కరోనా నేపథ్యంలో తక్కువ మొత్తానికి వకీల్ సాబ్ హక్కులు తీసుకున్నారు. అయితే ఓవర్సీస్ లో ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. ఇప్పుడు మూడు వారాల తర్వాత సినిమా విడుదల చేస్తుండడంతో తమకు నష్టపరిహారంగా రూ.3 కోట్లు ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమకు నష్ట పరిహారం చెల్లించకపోతే రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం న్యాయపరంగా కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని నిర్మాత దిల్ రాజుకు వాళ్లు చెప్పారని తెలుస్తోంది. ఈ విషయంపై రాజుగారి లీగల్ టీం కూడా బాగానే పని చేస్తున్నారు. మరి ఈ కాంట్రవర్సీ ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

