Ustad Gabbar Singh | పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాపై నిర్మాతలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నదని వారు తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హరీశ్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నది.
ఈ సినిమా గురించి రీసెంట్గా నిర్మాతలు మాట్లాడుతూ – ‘ఇటీవలే పవన్‌కల్యాణ్‌ని కలిశాం. ఆయన షూటింగ్‌కి సుముఖంగానే ఉన్నారు. డేట్స్ ఇస్తే డిసెంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేస్తాం. ‘గబ్బర్‌సింగ్’కి అప్డేట్ వర్షెన్లా ఉంటుంది మా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ అని అన్నారు.
సెప్టెంబర్ 2న పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఓ స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.