అగ్రహీరో పవన్‌కల్యాణ్ తన కమిట్మెంట్లన్నీ చకచకా పూర్తి చేసేశారు. పాత కమిట్మెంట్లలో చివరిదైన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమాను సైతం కంప్లీట్ చేసేశారాయన. వచ్చే ఏడాది విడుదలకానున్న ఈ మాస్ ఎంటర్టైనర్పై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి. దీనికితోడు బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ తర్వాత వస్తున్న సినిమా. దాంతో మరో బ్లాస్ట్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తున్నది.
డిసెంబర్ 31న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారట. ఈ ఏడాది ఎండింగ్‌ని ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ బీట్స్‌తో మోత మోగించాలనే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్. దీనికోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నారట. శ్రీలీల, రాశీఖన్నా ఇందులో కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, దర్శకత్వం: హరీశ్‌శంకర్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్.