Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. ముందుగా ప్రకటించిన ప్రకారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ లుక్‌ను విడుదల చేశారు.
మీరు ప్రేమించిన, ప్రశంసించిన, విజిల్ వేసిన పవర్ స్టార్‌ను తీసుకురాబోతున్నాం. ఇప్పుడు మరింత ఎనర్జీ, స్టైలిష్ మూమెంట్స్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి సింగిల్ ప్రోమో డిసెంబర్ 9న సాయంత్రం 6.30 గంటలకు విడుదల అవుతుందని ట్వీట్ చేశారు మేకర్స్. పవన్ కల్యాణ్ నయా స్టైలిష్ లుక్క్ ఫిదా అవుతున్నారు అభిమానులు.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న 2026కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Presenting the POWER STAR you loved, hailed and whistled for.
Now with more energy, unmatched attitude and blasting moves 🕺🏻🔥💥#UstaadBhagatSingh first single promo out on December 9th at 6.30 PM ❤🔥Our CULT CAPTAIN @harish2you‘s feast with ROCKSTAR @ThisIsDSP‘s musical… pic.twitter.com/ILpYqZ7ByZ
— BA Raju’s Team (@baraju_SuperHit) December 7, 2025
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు