They Call Him OG | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమాల్లో ఒకటి ఓజీ (They Call Him OG). సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రియారెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. కాగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఓజీ గ్లింప్స్ సెన్సార్ ఇవాళ పూర్తయింది. అంతేకాదు ఓజీ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలతో కలిసి స్క్రీనింగ్ కాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. గ్లింప్స్ రన్ టైం 1.39 నిమిషాలు. కాగా సుజిత్ ఎలాంటి విజువల్స్‌తో గ్లింప్స్ కట్ చేశాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే నిజమైతే ఈ సంక్రాంతికి పవన్ కల్యాణ్ అభిమానులకు రెండు పండగలుండబోతున్నాయన్నమాట. ఇంకేంటి మరి రెడీగా ఉండండి.
ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ లాంచ్ చేసిన ఓజీ HUNGRYCHEETAH గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ పూర్తిగా నయా అవతార్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఓజీలో పాపులర్ జపనీస్ నటుడు కజుకి కిటముర, ప్రముఖ థాయ్ యాక్టర్ Vithaya Pansringarm కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#TheyCallHimOG – A 1.39-minute glimpse was censored today and will be attached to Sankranthi films. #PawanKalyan 👑 pic.twitter.com/17BIZ3e3i6
— TalkEnti (@thetalkenti) January 8, 2025
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య