 
                                                            Akira Nandan | టాలీవుడ్ స్టార్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇక ఎమ్మెల్యేగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారని తెలిసిందే. కాగా పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్ (Akira Nandan) ఇండస్ట్రీ ఎంట్రీపై ఏదో ఒక వార్త ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంది. కాగా అకీరా నందన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాడు.
ఏపీ ఎన్నికల్లో గెలిచిన తన తండ్రి పవన్ కళ్యాణ్ యొక్క ఎడిట్‌ను నెట్టింట షేర్ చేసుకోవడం వైరల్ అయింది. అయితే ఇది కొంతమంది పవన్ అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. అకీరా నటనలోకి రావాలని అభిమానులు కోరుకుంటుండగా.. సంగీతం, ఎడిటింగ్‌పై అకీరా ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోందన్న టాపిక్ తెరపైకి వచ్చింది. ఇది అభిమానులకు కొంత నిరాశ కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో అకీరాను యాక్టర్‌గా రేణూదేశాయ్ అనుమతించరు అంటూ నెట్టింట కామెంట్స్ దర్శనమిచ్చాయి. దీనిపై మనస్తాపం చెందిన రేణూ దేశాయ్ స్పందిస్తూ.. అకీరానందన్ పుట్టిన క్షణం నుంచి నేను అతడికి మొదటి అభిమానిని అని దయచేసి అర్థం చేసుకోండి. అకీరా నందన్ త్వరలో యాక్టింగ్ మొదలు పెడతాడని ఆశిస్తున్నా. అయితే నేను అతని నిర్ణయాన్ని, భావాలను గౌరవించాలి. అకీరా నటనా రంగప్రవేశానికి సంబంధించి నన్ను ఎప్పుడూ అసహ్యించుకోవడం మానేయండి.. అతడి జీవితం.. అకీరా ఏం కావాలనుకున్నా అతడి తల్లిగా వందశాతం సపోర్ట్ చేస్తానని సోషల్ మీడియా ద్వారా అందరినీ కోరింది రేణూదేశాయ్.
#AkiraNandan Edited this for his Nana #PawanKalyan few days back Shared by #RenuDesai garu pic.twitter.com/ilW5gPAeX1
— Dileep Kumar (@chirufanikkada1) June 5, 2024
 
                            