Bro Teaser | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిత్యం ఏదో ఒక అప్డేట్తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి బ్రో (Bro The Avatar). సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. ట్రెండింగ్ అవుతున్నాయి. మేకర్స్ ముందుగా అప్డేట్ ప్రకారం మేకర్స్ బ్రో టీజర్‌ను లాంఛ్ చేశారు.
టైమ్ లైన్ విజువల్స్‌తో టీజర్ షురూ అవగా.. ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఏవండి ఎవరూ లేరా అని అడుగుతున్నాడు చీకట్లో ఉన్న సాయిధరమ్ తేజ్. హలో మాస్టారు.. గురువుగారు.. హలో తమ్ముడు.. బ్రో అనే డైలాగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండగా.. పవన్ కల్యాణ్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. చివరలో సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్వు అని సాయిధరమ్ అడుగుతున్నాడు పవన్ కల్యాణ్. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు సముద్రఖని.
పవన్ కల్యాణ్ ఇప్పటికే బ్రో డబ్బింగ్ పనుల్లో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వినోదయ సీతమ్ రీమేక్ (Vinodaya Sitham Remake)గా వస్తున్న ఈ మూవీలో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న బ్రో చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు నేటివిటీకి అనుగుణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
బ్రో టీజర్..
All your wait is WORTHY 🫰
Here’s #BroTeaser
A New Level of Swag, Goosebumps & Madness 🥳🔥https://t.co/BgOdu48rvD@PawanKalyan @IamSaiDharamTej@thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @lemonsprasad @zeestudiossouth#BroTheAvatar#BROFromJuly28 pic.twitter.com/5evAShYMoE— People Media Factory (@peoplemediafcy) June 29, 2023