Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ఉడిపి శ్రీ కృష్ణ మఠం పర్యటన సక్సెస్ ఫుల్‌గా సాగింది. డిసెంబర్ 7న జరిగిన ఈ పర్యటనలో ఆయన పర్యాయ పుత్తిగె మఠం నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ సమారోపణలో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం హనుమంతుడి దర్శనం చేసుకొని, గీతా పారాయణ కార్యక్రమం చివరి రోజు ఉత్సవాలను వీక్షించారు.సమారోపణ కార్యక్రమంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. భగవద్గీతను కేవలం ఆధ్యాత్మిక గ్రంథంగా కాకుండా, జీవితానికి దారి చూపే మార్గదర్శిగా భావిస్తున్నానని, జెనరేషన్ Z యువత తప్పనిసరిగా గీతను చదవాలని సూచించారు.
సనాతన ధర్మాన్ని రక్షించడానికి, మధ్వాచార్యుల బోధనలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న పిలుపునిచ్చారు.తమిళనాడులో ఇటీవల జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ..అన్యాయంపై నిశ్శబ్దంగా ఉండకూడదని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ భాష ద్వారా కన్నడ సంస్కృతికి తాను దగ్గరయ్యానని కూడా వెల్లడించారు. ఇక పుత్తిగె మఠ పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామిజీలు పవన్ కళ్యాణ్‌కు
‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు అందజేశారు. ఇది విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారసత్వాన్ని సూచించే గౌరవ ప్రతీకగా పరిగణించబడుతోంది.అయితే కర్ణాటకలో కూడా పవన్ హవా నడుస్తుండడం చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. అయితే మోకాళ్లపై కూర్చొని మరీ పవన్ సన్మానం స్వీకరించడం చూసిన ప్రతి ఒక్కరు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పవన్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడని, ఆయన సింప్లిసిటీకి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.
ఏపీ ప్రభుత్వం మధ్వాచార్యుల బోధనలు, భగవద్గీత సారాంశం వంటి అంశాలను పాఠశాల సిలబస్‌లో చేర్చాలని కోరారు స్వామిజి. అలాగే త్యాగరాజు సంగీత పరిశోధన కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి పవన్ కళ్యాణ్ హామీ ఇస్తూ ‘కోటి గీతా లేఖన యజ్ఞం’ వంటి కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.