అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ‘ఓజీ’తో ఈ ఏడాది దసరా బరిలోకి దిగబోతున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశాయి. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పాటకు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘గన్స్ అండ్ రోజెస్’ పేరుతో మరో పాటను రిలీజ్ చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాట యాక్షన్ ప్యాక్డ్ ‘ఓజీ’ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లేలా ఉంది. కథానాయకుడు ఓజస్ గంభీర ఎదుర్కొనే భయంకరమైన అండర్‌వరల్డ్ ప్రపంచం, అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేస్తూ సాగింది. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్నందించారు.