నటుడిగా, దర్శకుడిగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు సముద్రఖని (Samuthirakani). డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్‌తో ఆకట్టుకుంటాడు సముద్రఖని. ఇటీవలే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన భీమ్లానాయక్లో డానియల్ శేఖర్ తండ్రి పాత్ర(మెయిన్ విలన్) లో నటించాడు. పాత్ర నిడివి తక్కువే అయినా మంచి స్పందన వస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా పోటీ పడ్డ పవన్ కల్యాణ్, సముద్రఖని మరో క్రేజీ ప్రాజెక్టు చేయబోతున్నారనే ఓ క్రేజీ అప్ డేట్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
సముద్రఖని దర్శకత్వంలో పవన్ హీరోగా సినిమాకు అంతా రెడీ అయిందట. ఫిలింనగర్ సర్కిల్ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ కాంబినేషన్ సినిమా ఉగాది పండుగ సందర్భంగా గ్రాండ్‌గా లాంఛ్ కాబోతుందని ఇన్సైడ్ టాక్. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా మల్టీ స్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో యువ నటుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. సముద్రఖని తెరకెక్కించిన సినిమాను పవన్, తేజ్ తో రీమేక్ చేయబోతున్నాడని తొలువ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇపుడు మాత్రం ఈ ఇద్దరు యాక్టర్ల కోసం సముద్రఖని డిఫరెంట్ స్టోరీని సిద్దం చేసినట్టు వార్తలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మారిన కథతో పవన్ కల్యాణ్ అభిమానులకు చాలా ఫ్రెష్ ఫీల్ కలిగించేలా సినిమా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా..మేకర్స్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారట.
Raashi Khanna | మీరే మెయిన్ విలనా..? అని అడుగుతున్నారు : రాశీఖన్నా
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (Peopled Media Factory), పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Rashmika Mandanna | మరో జన్మలో అబ్బాయిగా పుట్టాలనుంది: రష్మిక